Begin typing your search above and press return to search.

న్యాయస్థానం టూ దేవస్థానం : పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:37 AM GMT
న్యాయస్థానం టూ దేవస్థానం : పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X
న్యాయస్థానం టూ దేవస్థానం నినాదంతో అమరావతి రాజధాని రైతుల చేపట్టదలచిన మహా పాదయాత్రకు ఆంధప్రదేశ్ హైకోర్టు అనుమతినిచ్చింది.రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి, వాటిని ఉద్యమ నిర్వాహకులు అమలు చేయలేరని,మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిథిలో ఉన్నదని, దాని మీద ఆందోళనకు అనుమతించడం వీలుకాదని చెబుతూ పొలీసులు ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈవిషయాన్ని ప్రభుత్వన్యాయవాది ప్రస్తావించారు.

పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించిన న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. దీనితో పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. అయితే,రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని., శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు వెల్లడించారు. అనంతరం షరతులతో పాదయాత్రకు అనుమతినిచ్చింది.