Begin typing your search above and press return to search.
ఆర్టీసీ కథ ఇక ముగిసినట్టేనా ... ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
By: Tupaki Desk | 22 Nov 2019 12:14 PM GMTతెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడం తో కొంత నిరాశలో ఉన్న కార్మికులకు తాజాగా మరో షాక్ తగిలింది. సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 5,100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ కార్మికులు హై కోర్ట్ లో పిటిషన్ వేయగా .. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేస్తూ ..పిటిషన్ ని కోర్ట్ కొట్టివేసింది. దీనితో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అయ్యింది. గతంలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిన కోర్టు.. ఇవాళ వాదప్రతివాదనలు విన్న తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో రూట్ల ప్రైవేటీకరణ అమలు బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించగా .. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు.. కేబినెట్ తీర్మానంలో ఉందని కోర్టుకి తెలిపారు. దీనితో ప్రభుత్వం వేరు... అథారిటీ వేరు.. ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని న్యాయస్థానం ప్రశ్నించింది. రవాణశాఖ ముఖ్య కార్యదర్శి ప్రక్రియను నిర్వహిస్తారని ఏజీ బదులిచ్చారు. కేబినెట్ తీర్మానంలో అలా లేదని... ప్రైవేటీకరణ అధికారం అథారిటీకి ఎలా ఇస్తారని కోర్టు నిలదీసింది. మొత్తంగా పిటిషన్ ని కొట్టి వేయడం తో ప్రైవేటీకరణ పనులు వేగవంతమైయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక ఈ తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ భవితవ్యం, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇటు కార్మికులు..అటు ప్రజల లోను ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి. అలాగే ప్రభుత్వం కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవటం కూడా కష్టమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.