Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే బిల్డింగ్ ను కూల్చేయమన్న హైకోర్టు
By: Tupaki Desk | 27 Jun 2016 9:40 AM GMTతెలంగాణ అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేకు ఇబ్బందికర పరిస్థితి చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందిన వివేకానంద గౌడ్ కు తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ నుంచి కారు ఎక్కిన ఆయనకు చెందిన భవనాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు.. ఎమ్మెల్యేకు చెందిన భవనంలో నడుస్తున్నకార్పొరేట్ కాలేజీని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది.చింతల్ లో ఎమ్మెల్యే వివేకానందకు పలు అక్రమ ఆస్తులు ఉన్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టుకు పలువురు పిటీషన్లు దాఖలు చేశారు.దీనిపై గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా ఎమ్మెల్యేకు ఉన్న భవనాలన్నీ అక్రమాస్తులుగా కోర్టు తేల్చింది.
ఆయనకు చెందిన అక్రమ భవనంపై కొరడా ఝుళిపించింది.ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది.అక్రమకట్టడాలు ఎక్కడున్నా కూల్చివేయాల్సిందేనని పేర్కొంది. ఎమ్మెల్యేకు చెందిన భవనాన్ని కూల్చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అధికారపార్టీలో చర్చనీయాంశంగా మారిందన్న మాట వినిపిస్తోంది.