Begin typing your search above and press return to search.
బిల్లులు చెల్లిస్తుందా? కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటుందా?
By: Tupaki Desk | 8 Sep 2021 5:40 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఆ లోపు చెప్పిన పని పూర్తి చేయకపోతే, కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొవాల్సి ఉంటుంది అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏపీ ప్రభుత్వం చేసిన ఆ అతిపెద్ద తప్పేంటి అంటే ఉపాధిహామీ పథకం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమే. ఈ నెల 15వ తేదీలోపు బిల్లులన్నీ చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించడం చర్చనీయాంశమైంది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలోచన ధోరణి లో ఉంది.
మరోవైపు పనులు చేసి బిల్లుల చెల్లింపులకు నోచుకోకపోవడంతో కాంట్రాక్టరల్లు ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల విషయమై కొన్ని నెలలుగా కోర్టులో వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు బిల్లుల చెల్లింపులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఖజానాలో డబ్బు లేకపోవడంతో ఏదో ఒకటి చెప్తూ ఇన్ని రోజులు ప్రభుత్వం నెట్టుకువచ్చింది. ఇక అలా చేయడానికి కూడా వీల్లేనన్ని గడువులు ముగిశాయి. ఆరు నెలల క్రితమే హైకోర్టు జోక్యం చేసుకుని ఈ బిల్లులన్నీ చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా, ఐఏఎస్ అధికారుల్ని హైకోర్టుకు పిలిపించినా ఇప్పటికీ ఈ బిల్లులు పూర్తిగా చెల్లించలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారం పూర్తయ్యేలోపు ఈ బిల్లుల చెల్లింపు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ఇకపోతే , రెండు వారాల క్రితం 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే , ప్రభుత్వం మాత్రం కేవలం 25 కేసుల్లోనే చెల్లింపులు చేయడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సర్పంచ్ అకౌంట్లోకి వేస్తే వారు కాంట్రాక్టర్ కి చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి సర్పంచుల వివరాలు ఇస్తే, వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. కొన్ని కేసులలో విచారణ జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు విచారణ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు నిలిపివేస్తే వారి జీవనాధారం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 15వ తేదీలోపు చెల్లింపులు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించడం సంచలనం రేపుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఎప్పటిలాగే బిల్లులు త్వరలో క్లియర్ చేస్తామని చెబుతోంది.