Begin typing your search above and press return to search.

రేవంత్‌ బెయిల్‌.. ఈసారీ కష్టమేనా..?

By:  Tupaki Desk   |   24 Jun 2015 4:25 AM GMT
రేవంత్‌ బెయిల్‌.. ఈసారీ కష్టమేనా..?
X
రెండు రాష్ట్రాల మధ్య మరింత రచ్చకు కారణమైన ఓటుకు నోటు వ్యవహారంలో.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్‌రెడ్డి.. మరో ఇద్దరూ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

తమకు బెయిల్‌ ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. విచారణకు ఒక రోజు ముందే ఏసీబీ.. రేవంత్‌ అండ్‌ కోకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వకూడదన్న మాటను బలంగా చెబుతూ కౌంటర్‌ దాఖలు చేసింది.

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు కీలకదశలో ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు కానీ బెయిల్‌ ఇస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సందేహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి మరో ఇద్దరికి ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్‌ లభించటం కష్టమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెయిల్‌ ఇచ్చిన సక్షంలో తమ దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని ఏసీబీ వాదించే నేపథ్యంలో.. బెయిల్‌ ఇస్తారా? అన్న సందేహాన్ని పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సమయంలో బెయిల్‌ ఇవ్వటం చాలా అరుదుగా చెబుతున్నారు. కేసులోని సున్నిత అంశాల నేపథ్యంలో బెయిల్‌ రావటం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. బెయిల్‌పై నిర్ణయాన్ని వెంటనే వెల్లడిస్తారా? లేదంటే వాయిదా వేస్తారా? అన్నది ఉత్కంటగా మారింది. మొత్తంగా అయితే.. రేవంత్‌రెడ్డి అండ్‌ కోలకు కాలం అనుకూలంగా లేనట్లే కనిపిస్తోంది.