Begin typing your search above and press return to search.
మాల్స్.. మల్టీఫ్లెక్సుల మాటేంటి అన్న వేళ.. హైకోర్టు జవాబు ఇదే
By: Tupaki Desk | 5 Jan 2022 4:34 AM GMTకొత్త సంవత్సరం అడుగు పెట్టినంతనే హైదరాబాదీయులకు ఒక సందడి కార్యక్రమం మొదలవుతుంది అదే.. నాంపల్లిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్. న్యూమాయిష్ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ భారీగా నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనటానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. దాదాపు నెలకు పైనే సాగే ఈ ఎగ్జిబిషన్ ను హైదరాబాదీయులు తప్పనిసరిగా సందర్శించటం ఒక రివాజు. అయితే.. ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించి 2019లో జరిగిన అగ్నిప్రమాదంపై తాజాగా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరికాదంటూ ఎగ్జిబిషన్ సొసైటీ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా మరో వాదనను ప్రస్తావించింది. సినిమా థియేటర్లు.. మాల్స్ కు లేని ఆంక్షలు ఎగ్జిబిషన్ కు ఎలా విధిస్తారంటూ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రశ్నించింది. దీనికి రియాక్టుఅయిన హైకోర్టు.. బయటకు రావటానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అని ప్రశ్నించింది.
ఎగ్జిబిషన్ నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని.. కొవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ ఉంచాలా? లేదా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని హైకోర్టుస్పష్టం చేసింది. నాంపల్లి అగ్నిప్రమాదంపై జరిగిన విచారణలో ప్రభుత్వం స్పందిస్తూ.. ఫైర్.. జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని పేర్కొంది. ప్రభుత్వ వివరణతో 2019 అగ్నిప్రమాదంపై విచారణను హైకోర్టు పూర్తి చేసింది.