Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ టోకు పిటిష‌న్ల‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   28 Jan 2019 10:40 AM GMT
కాంగ్రెస్ టోకు పిటిష‌న్ల‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం
X
ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అక్ర‌మాల‌కు పాల్ప‌డిందంటూ కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు ఆరోపించ‌టం తెలిసిందే. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ప‌లు ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌ల్ని చేప‌ట్టింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌నే ప‌లువురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్ల‌దంటూ ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

త‌మపై గెలిచిన అభ్య‌ర్థుల్లో ప‌లువురు ఎన్నిక చెల్ల‌దంటూ ఆదేశించాల‌ని కోరుతూ 12 మంది కాంగ్రెస్ అభ్య‌ర్థులు.. ఒక టీడీపీ అభ్య‌ర్థి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను ప‌రిశీలించిన తెలంగాణ హైకోర్టు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు వేసిన పిటిష‌న్లు అన్నింటిని క‌లిపి ఒకే కేసు కింద ప‌రిగ‌ణించి విచార‌ణ చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌పై వ్య‌క్తిగ‌తంగా చేసిన అన్ని ఆరోప‌ణ‌ల్ని ఒకే కేసు కింద విచార‌ణ‌ను కోర్టు చేప‌ట్ట‌నుంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అభ్య‌ర్థులు దాఖ‌లు చేసిన పిటిష‌న్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.కొడంగ‌ల్ టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి ఎన్నిక‌ల రూల్స్ ను బ్రేక్ చేశార‌ని.. ఎన్నిక‌ల్లో ఆయ‌న రూ.6.5 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా డైరీ దొరికిన‌ట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించ‌గా.. ధ‌ర్మ‌పురి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి కొప్పుల ఈశ్వ‌ర్ ఎన్నిక‌ల చెల్ల‌ద‌ని కాంగ్రెస్ నేత అడ్డూరీ ల‌క్ష్మ‌ణ్ కుమార్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

మిగిలిన వారితో పోలిస్తే కొప్పుల ఈశ్వ‌ర్ మీద ఉన్న ఆరోప‌ణ‌లు తీవ్ర‌మైన‌విగా చెప్పాలి. ఈవీఎంల‌ను టాంప‌రింగ్ చేశార‌ని..వాటిని భ‌ద్ర‌ప‌రిచిన గ‌దుల‌కు కనీసం సీల్ కూడా వేయ‌లేద‌ని.. వాటి భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేశార‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మ‌రి.. ఈ కేసుల విచార‌ణ చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింద‌ని చెప్పాలి.