Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ఏపీ మంత్రిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఓకే
By: Tupaki Desk | 19 Nov 2020 5:51 PM GMTఏపీ మంత్రి చిక్కుల్లో పడ్డారు. ఏకంగా ఆయనపై సీబీఐ దర్యాప్తు చేయడానికి హైకోర్టు ఓకే చెప్పడం సంచలనమైంది. కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ మంత్రి జయరాంపై గుమ్మనూరు పేకాట వ్యవహారంపై హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలైంది. ఈ పేకాట క్లబ్ వ్యవహారంలో మంత్రి జయరాం పాత్ర తేల్చడానికి సీబీఐ విచారణకు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఆయన పాత్ర ఉండడంతోనే తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దాడి చేశారని కోర్టుకు విన్నవించారు.సీబీఐ విచారణతో మంత్రి జయరాం పాత్ర తేల్చాలని పిటీషన్ లో ప్రస్తావించారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు అనుమతించింది. మంత్రి జయరాంను ప్రతివాదిగా పిటీషన్ చేశారు.
కాగా ఈ పిటీషన్ పై మంత్రి జయరాం స్పందించారు. గుమ్మనూరు పేకాట క్లబ్ లో తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. పేకాట విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. పేకాట క్లబ్ లో తన ప్రమేయం ఉంటే పోలీసులు వచ్చేవారు కాదని అన్నారు.
ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుమట్టాయి. మంత్రి సొంతూరు గుమ్మనూరులో భారీ పేకాట క్లబ్ బయటపడడం.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేయడం.. మంత్రికి వరుసకు సోదరుడైన వ్యక్తిపై కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. సీనియర్ నేత అయ్యన్న రాద్ధాంతం చేశారు. తాజాగా టీడీపీ నేతలే హైకోర్టులో మంత్రిపై పిటీషన్ వేసినట్లు తెలుస్తోంది.