Begin typing your search above and press return to search.

ఏపీ సర్కార్ జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:37 PM GMT
ఏపీ సర్కార్ జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!
X
2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ వైసీపీ ప్రభుత్వానికి ఫిబ్రవరి 17న డీజీపీ లేఖ రాశారు. ఆ లేఖను ఆమోదిస్తూ ఆగస్టు 12న 776 జీవో విడుదలైంది.

ఈ అంశంపై తాజాగా ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం’ నుంచి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తమ వాదనలు వినిపించారు. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ పైనే జరిగిన దాడిలో పోలీసులు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని.. ఇటువంటి నేరాలు భవిష్యత్తులో పునరావృతం అయ్యేందుకు ఈ జీవో తావిస్తోందని.. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని హైకోర్టును పిటీషనర్ కోరారు.

కాగా ఈ జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోపైన భాషపైన న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు.

పిటీషన్లో ఎన్ఐఏని కూడా పార్టీగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సదురు జీవో నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదికి ధర్మాసనం వాయిదావేసింది.