Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారుకు మరో కోర్టు ‘‘పంచ్’’
By: Tupaki Desk | 5 Jan 2017 7:38 AM GMTపాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొత్త రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం తడబడుతూనే ఉంది. ఆ విషయం గడిచిన రెండున్నరేళ్లుగా చూస్తున్నదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేయటం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని నిలిపివేయటం.. అక్షింతలు వేయటం లాంటివి చాలానే చూశాం. తాజాగా అలాంటి తీరులోనే మరో నిర్ణయాన్ని ఉమ్మడి కోర్టు వెల్లడించింది.
వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిపేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 123పై హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం భూములు సేకరించే వీల్లేదన్న స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. అదే సమయంలో యూపీఏ హయాంలో నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ద్వారా భూములు సేకరిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని తేల్చి చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయటానికి అవసరమైన భూముల్ని సేకరించేందుకు వీలుగా జీవో నెంబరు123 ను విడుదల చేసింది. అయితే..ఈ జీవో జారీతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని.. తమ నుంచి రాష్ట్ర సర్కారు బలవంతంగా భూములు సేకరిస్తోందని మల్లన్నసాగర్ నిర్వాసితులతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రైతులు పెద్ద ఎత్తున కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో పిటీషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరుపక్షాల వాదనల్ని విన్నది. తాము బలవంతంగా భూముల్ని సేకరించటం లేదని.. స్వచ్చందంగా ముందుకు వచ్చిన రైతుల నుంచే భూములు సేకరిస్తున్నట్లుగా ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. భూసేకరణ చట్టంలో పేర్కొన్న పరిహారం కంటే ఎక్కువగానే ఇస్తున్న వెల్లడించారు. అదే సమయంలో బాధితుల వాదనల్ని విన్న కోర్టు.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 123 జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో అధారంగా భూములు సేకరించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలుజారీ చేసింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ సర్కారుకు పంచ్ లాంటిదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/