Begin typing your search above and press return to search.

పెండింగ్ బిల్లులపై హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   4 Aug 2021 11:30 AM GMT
పెండింగ్ బిల్లులపై హైకోర్టు సీరియస్
X
పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. బిల్లులను చెల్లించాల్సిందే అని తాము ఆదేశించిన తర్వాత కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిచకపోవటంపై మండిపోయింది. తెలుగుదేశంపార్టీ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లులను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. సుమారుగా రు. 1794 కోట్లు చెల్లించాల్సుంది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా బిల్లులు చెల్లించకపోవటంతో చివరకు కొందరు కోర్టులో కేసులు వేశారు.

ఇదే విషయమై విచారణ జరిపిన న్యాయస్ధానం ఆగష్టు 1వ తేదీకంతా బిల్లులు చెల్లించాల్సిందే అని ఆదేశించింది. అయితే కోర్టు విధించిన గడువునాటికి ప్రభుత్వం రు. 413 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇదే విషయమై డిఫెన్స్ న్యాయవాది విచారణలో మాట్లాడుతు ప్రభుత్వం చెప్పినట్లుగా రు. 413 కోట్లు చెల్లించలేదని చెల్లించింది కేవలం రు. 43 కోట్లు మాత్రమే అనిచెప్పారు. దాంతో కోర్టు మరింత సీరియస్ అయ్యింది.

తమ ఆదేశాలను ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడిం. భవిష్యత్తులో కూడా ఇదే పునరావృతమైతే సీరియస్ ఆదేశాలను ఇవ్వాల్సుంటుందని వార్నింగ్ ఇచ్చింది. అసలు చేయాల్సిన చెల్లింపులెంత ? చెల్లించింది ఎంత అనే విషయంలో ప్రభుత్వం ఎందుకు సరిగా స్పందించటం లేదని కోర్టు సూటిగా ప్రశ్నించింది. చెల్లింపులకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారంతో ఎందుకు కోర్టుకు రావటంలేదని నిలదీసింది.

చెల్లింపులు నిలిపేసినందుకు అధికారులు చెప్పిన కారణలేవీ ఎందుకని కౌంటర్లో చూపించటం లేదని అడిగింది. ఇదే సమయంలో ప్రతిబిల్లులోను 20 శాతం మినహాయించుకుని ఎందుకు చెల్లిస్తున్నారంటు అడిగింది. మినహాయించుకుంటున్న 20 శాతం మొత్తాన్ని ఎక్కడ ఉంచుతున్నారంటు కోర్టడిగిన ప్రశ్నకు ప్రభుత్వ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదావేస్తు ఆరోజు సంబంధిత అధికారులందరు హాజరుకావాలని ఆదేశించింది.