Begin typing your search above and press return to search.

రఘురామ కేసులో హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   19 May 2021 11:30 AM GMT
రఘురామ కేసులో హైకోర్టు సీరియస్
X
నర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు కేసులో రాష్ట్ర ప్ర‌భుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేయాలంటూ స‌ర్కారు దాఖ‌లు చేసిన లంచ్ మోష‌న్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. మేజిస్ట్రేట్ ఉత్త‌ర్వుల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించింది.

అదేవిధంగా.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కుమెడిక‌ల్ రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశిస్తే.. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని, రాత్రి 11 గంట‌ల‌కు ఆర్డ‌ర్ కాపీ ఇచ్చిన‌ప్ప‌టికీ చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి సుమోటోగా కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు ఇవ్వాల‌ని జ్యుడీషియ‌ల్ రిజిస్ట్రార్ ను ఆదేశించింది.

ఇదిలాఉండ‌గా.. ర‌ఘురామ వైద్య ప‌రీక్ష‌ల విష‌యం ఉత్కంఠ రేపుతోంది. గ‌త శుక్ర‌వారం సీఐడీ అరెస్టు చేసిన త‌ర్వాత‌.. విచార‌ణ‌లో త‌న‌ను కొట్టార‌ని ఎంపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేర‌కు గుంటూరు జీజీహెచ్ లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి రిపోర్టు అంద‌జేశారు.

అయితే.. ఈ విష‌య‌మై సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు ఎంపీ. దీంతో.. హైద‌రాబాద్ లోని ఆర్మీ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. అక్క‌డ ప‌రీక్ష‌లు పూర్తిచేసి, రిపోర్టును సీల్డ్ క‌వ‌ర్ లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టుకు అంద‌జేశారు. దీంతో.. ఆ రిపోర్టులో ఏముంది అనే ఉత్కంఠ నెల‌కొంది.