Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   3 Jan 2022 10:53 AM GMT
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో  మరో ఎదురుదెబ్బ
X
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ధార్మిక పరిషత్ సభ్యుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి, అధికారులకు నోటీసులిచ్చింది.

ధార్మిక పరిషత్ సభ్యులసంఖ్య తగ్గిస్తూ తెచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరుఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. 21మంది సభ్యుల పరిషత్ ను నలుగురికి పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. చట్టంపై స్టే ఇవ్వాలని ఉమేశ్ చంద్ర కోర్టును కోరారు. కౌంటర్ వేశాక పరిశీలిస్తామని విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇక సినిమా టికెట్ ధరల పిటీషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అఫిడవిట్ దాఖలుకు అడ్వేకే్ట జనరల్ సమయం కోరారు. దీంతో హైకోర్టు వాయిదా వేసింది.