Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : టీడీపీ కేంద్ర కార్యాలయానికి కోర్టు నోటీసులు !

By:  Tupaki Desk   |   16 Dec 2019 10:37 AM GMT
బ్రేకింగ్ : టీడీపీ కేంద్ర కార్యాలయానికి కోర్టు నోటీసులు !
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన నూతన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ఇటీవలే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు - ఎమ్మెల్సీ లోకేష్ కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యాలయానికి న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రభుత్వ భూమిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని ఆరోపిస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా హై కోర్ట్ లో ఫీల్ వేశారు.

రెవిన్యూ అధికారులు టీడీపీ కార్యాలయం నిర్మించిన స్థలం ప్రభుత్వ వాగు పోరంబోకు గా తేల్చినా..ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా అక్రమంగా నిర్మాణం పూర్తి చేసారని కోర్టులో పిల్ దాఖలు చేసారు. దీని పైన విచారణకు స్వీకరించిన హైకోర్టు మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వంతో పాటుగా జిల్లా కలెక్టర్ అదే విధంగా టీడీపీకి నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే ఆ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ నుండి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ కార్యాలయం న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవటం పైన టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇకపోతే , టీడీపీ జాతీయ కార్యాలయం కోసం గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే మూడు ఎకరాల 65 సెంట్లు ప్రభుత్వం కేటాయించగా.. నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థ ఎస్‌ ఆర్‌ ఆర్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 392/2 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. దీని పైన కొద్ది రోజుల క్రితం ఆరోపణల పైన విచారించేందుకు రెవిన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిని పరిశీలించారు. ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు. ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే.. ఈ కార్యాలయం వ్యవహారం న్యాయ పరమైన వివాదంగా మారింది.