Begin typing your search above and press return to search.
మీ రాజధాని ఏదంటూ మా అమ్మాయిని ఆటపట్టిస్తున్నారు.. ఏపీ హైకోర్టు జడ్జి
By: Tupaki Desk | 18 Sep 2022 3:32 PM GMTఒకే భాష మాట్లాడే తెలుగుజాతిలో పొడచూపిన విభేదాలు.. విభజన.. తెలుగు వారిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్లిందా? ఎనిమిదేళ్ల క్రితం వరకు ఉమ్మడిగా ఉన్న తెలుగు వారు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవటం తెలిసిందే. విభజన కారణంగా అన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్.. విభజన నష్టాన్నే కాదు.. అంతకు మించిన మాటల్ని అనిపించుకుంటున్న పరిస్థితి. ఏదో శాపం వెంటాడుతున్నట్లుగా.. ఏపీకి ఇప్పటికి రాజధాని అంటూ లేకపోవటం తెలిసిందే.
విభజన తర్వాత అమరావతిని ఏపీ రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించి.. కొంతమేర డెవలప్ మెంట్ చేయటం తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. ఒక రాజధాని కాదు మూడు రాజధానులంటూ కొత్త వాదనను తీసుకురావటమే కాదు.. తన మూడున్నరేళ్ల పాలనలో రాజధాని మీద అంతులేని అయోమయాన్ని మిగిల్చిన పరిస్థితి. ఓవైపు ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా తేల్చినప్పటికీ.. హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది జగన్ సర్కారు.
ఇలాంటి వేళ.. హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి అంటే చులకన అయిపోయిందన్న ఆయన.. ఇతర రాష్ట్రాల వద్ద అవమానాలు పడే పరిస్థితి తెలుగుజాతి ఉందన్నారు. 'మనలో ఐక్యత లేదు. ప్రతిదానికి కులం.. రాజకీయం.. స్వార్థమే ఉంది' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీకి రాజధాని లేని కారణంగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఇతర రాష్ట్రాల వారి ముందు ఎదురవుతున్న పరిస్థితుల్ని ఆయన ఒక ఉదాహరణలో చెప్పుకొచ్చారు.
తన కుమార్తె ఢిల్లీలోని కాలేజీలో చదువుతోందని.. ఆమెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి కారణంగా పిల్లలు సైతం తలదించుకునే స్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితల మీద ఉందన్నారు. 'ప్రజలను చైతన్యపరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది' అన్న ఆయన.. తెలుగు రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఏపీ రాజధానిపై మరో సారి ఆసక్తికర చర్చకు తెర లేచినట్లుగా చెప్పక తప్పదు.