Begin typing your search above and press return to search.
వైసీపీకి ఇపుడు హైకోర్టు షాకిచ్చింది
By: Tupaki Desk | 20 April 2016 5:08 PM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలు - ఎమ్మెల్యేలు జంపింగ్ లతో చిక్కులు పెడుతుండగా తాజాగా న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తిప్పారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ 2011లో ఆయన చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి నరేశ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అప్పటి నుంచి ఐదేండ్ల సుదీర్ఘ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తుది తీర్పు ఇచ్చింది. తిప్పారెడ్డి ఎన్నిక చెల్లదని, ఎమ్మెల్సీగా నరేశ్ కుమార్ రెడ్డి ఎన్నికైనట్లు హైకోర్టు ప్రకటించింది. 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో తిప్పారెడ్డి.. నరేశ్ కుమార్ రెడ్డిపై గెలుపొందగా...ఈ ఎన్నికపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే హైకోర్టు తీర్పు ఇపుడు వైసీపీకి తగులుతున్న ఝలక్‌ల పరంపరలో ఇది కొనసాగింపు అని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.