Begin typing your search above and press return to search.

త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు?

By:  Tupaki Desk   |   29 Nov 2019 7:41 AM GMT
త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు?
X
సుదీర్ఘంగా సాగిన ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్ ను క్లోజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వెలువరించిన వైనం తెలిసిందే. ఒక్కటంటే ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండా ముగిసిన సమ్మెపై ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీని ప్రవేటీకరణ చేస్తామని.. ఆర్టీసీ ముగిసిన అధ్యాయమని.. ఉద్యోగుల కథ ముగిసినట్లేనన్నట్లుగా వచ్చిన వార్తలకు ఆర్టీసీ కార్మికులు ఎంతగా వణికిపోయారో.. ఈ రోజు వారి మాటల్ని వింటుంటే అర్థం కాక మానదు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొద్దికాలంగా తెలంగాణలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలకు కోర్టులో ఉన్న అంశంపై తాజాగా హైకోర్టు కీలక చర్యను చేపట్టింది. తెలంగాణలోని 73 మున్సిపాల్టీలపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులైలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది.

వార్డుల విభజన.. ఓటర్ల జాబితా సవరణను మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా స్టే ఎత్తి వేసిన హైకోర్టు.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పింది. అంతేకాదు.. పద్నాలుగు రోజుల్లో అభ్యంతరాలు.. సవరణల్ని ముగించాలని కోరింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఉన్న కీలక అడ్డంకులు తొలిగినట్లుగా చెప్పాలి.