Begin typing your search above and press return to search.
దర్శనానికి వచ్చి మరణించిన హైకోర్టు జడ్జి
By: Tupaki Desk | 8 March 2016 4:42 AM GMTదైవదర్శనం కూడా ప్రముఖులు తిరుమలకు నిత్యం వచ్చి వెళుతుంటారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పలువురు ప్రముఖులు నిత్యం వచ్చి వెళ్లటం మామూలే. అయితే.. చాలా.. చాలా అరుదుగా జరిగే విషాదం ఒకటి తిరుమలలో చోటు చేసుకుంది. చండీఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేష్ కుమార్ సోమవారం తిరుమలకు వచ్చారు.
కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన తిరుమలలో పద్మావతి కాటేజీలో దిగారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయనకు హటాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన తిరుమలలోని ఆశ్వనీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి స్విమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన మరణించటం షాకింగ్ గా మారింది. దర్శనం కోసం సరదాగా వచ్చిన జడ్జిగారి ఫ్యామిలీ అంతులేని విషాదంలో కూరుకుపోయింది. ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ బాధకు గురవుతున్నారు.