Begin typing your search above and press return to search.

ఎర్రమంజిల్ కూల్చివేత: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   24 July 2019 12:46 PM GMT
ఎర్రమంజిల్ కూల్చివేత: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త అసెంబ్లీ - సచివాలయ నిర్మాణాల కోసం పాత సచివాలయం - ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడ శంకుస్థాపనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సకల సదుపాయాలతో ఉంది. ఇక సచివాలయం కూడా పూర్తి సామర్థ్యంతో ఉంది. కానీ కేసీఆర్ మాత్రం వాస్తు కారణంగానే కొత్తవి కడుతున్నాడనే ప్రచారం జరిగింది.

కాగా ఎర్రమంజిల్ కూల్చివేత - కొత్త అసెంబ్లీ నిర్మాణాలను నిరసిస్తూ కొందరు హైకోర్టు కెక్కారు. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై బుధవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తాజాగా హైకోర్టు ఎర్రమంజిల్ కూల్చివేసి కొత్త అసెంబ్లీ భవన నిర్మాణ కోసం హెఎండీఏ అనుమతి తీసుకున్నారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయం చెప్పేందుకు గడువు కోరడంపై హైకోర్టు ఫైర్ అయ్యింది. గురువారం వాస్తవ పరిస్థితులను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది.

కాగా అసెంబ్లీ - సచివాలయాలు బాగానే ఉన్న కేసీఆర్ వాస్తు పేరిట ఇలా కొత్త భవనాలు నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ - బీజేపీలో ఉద్యమిస్తున్నాయి. ఈ విషయమై ఐకమత్యంగా ముందుకెళ్లాలని ప్రజాప్రతినిధులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఎర్రమంజిల్ లో అసెంబ్లీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.