Begin typing your search above and press return to search.

చర్ల ఎన్ కౌంటర్: రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:41 PM GMT
చర్ల ఎన్ కౌంటర్: రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశం
X
చర్ల ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను రీపోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా చర్ల ఎన్ కౌంటర్ బూటకం అని పౌరహక్కుల సంఘం లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది.

ఈ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. చనిపోయిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరుచాలని పిటీషనర్ కోరారు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని పిటీషనర్ డిమాండ్ చేశారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణలతో రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టును కోరారు.

అయితే ఇప్పటికే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

ఆ మృతదేహాలను తిరిగి తీసుకొని రీపోస్టుమార్టం నిర్వహించి ఆ వీడియోను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

తెలంగాణలో మావోయిస్టులు విస్తరిస్తున్నారన్న నిఘా సమాచారం మేరకు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు నిఘా పెట్టి కూంబింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.