Begin typing your search above and press return to search.
'సదావర్తి' కేసులో టీడీపీకి చుక్కెదురు!
By: Tupaki Desk | 3 July 2017 10:02 AM GMTసదావర్తి సత్రం భూముల కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. విలువైన సదావర్తి సత్రం భూములను కారు చౌకగా కొందరికి కట్టబెట్టిన సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పునిచ్చింది. రూ.22 కోట్ల కంటే ఎక్కువగా మరో రూ.5కోట్లు చెల్లిస్తే ఆ భూములను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేటాయిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో టీడీపీ సర్కార్ కు న్యాయస్థానంలో చుక్కెదురైంది.
కోర్టు తీర్పును ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు. రెండు వారాల్లో 10 కోట్లు - నాలుగు వారాల్లోపు 17.44 కోట్ల రూపాయలు చెల్లించాలన్న హైకోర్టు తీర్పును శిరసావహిస్తానన్నారు. అదనంగా ఆ రూ.5 కోట్లు ఎక్కువగా చెల్లించేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకు తెలిపారు. గతంలో ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి సంబంధించిన 84 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులకు రూ.22కోట్లకే అమ్మిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 84 ఎకరాల సదావర్తి సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో సర్కారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వేలం నిబంధనల ప్రకారమే జరిగిందని సర్కారు పెద్దలు వాదించారు. వారి అక్రమాలను బయటపెట్టే కీలకమైన సాక్ష్యాన్ని‘సాక్షి’ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.
సదావర్తి సత్రం భూముల వేలంలో నిబంధనలకు పాతరేశారని, అడ్డగోలుగా వ్యవహరించారని ఆక్షేపిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్(ఆర్ జేసీ) ఆ శాఖ కమిషనర్ కు సవివరమైన నివేదిక అందజేశారు. అయితే, తమ గుట్టు రట్టవుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు ఈ లేఖను తొక్కిపెట్టేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/