Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీసులకు తలంటు పోసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   11 May 2021 2:30 PM GMT
తెలంగాణ పోలీసులకు తలంటు పోసిన హైకోర్టు
X
ప్రాణం పోతుందని.. ప్రత్యర్థి సాయం అడిగినా సాయం చేసేందుకు సిద్దమయ్యే కల్చర్ మనది. ఈ మధ్యన ఒక మధ్య వయస్కురాలి కోసం.. ఒక పెద్ద మనిషి తన బెడ్ ఇచ్చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వైనం యావత్ దేశాన్ని కదిలించింది. అంతటి మానవత్వాన్ని ప్రదర్శించే మనసున్న మనం.. కరోనా వేళ మరింత పెద్ద మనసుతో వ్యవహరించాలి. అందుకు భిన్నంగా ఏపీ నుంచి అత్యవసర వైద్యం కోసం తెలంగాణకు వస్తున్న అంబులెన్సుల్ని.. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసులు ఆపేసిన వైనం షాకింగ్ గానే కాదు.. సంచలనంగా మారింది.

ఈ అంశాన్ని ఈ రోజు (మంగళవారం) హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సుల్ని ఎందుకు ఆపుతున్నారు? అత్యవసర వైద్యం కోసం వస్తున్న వాహనాల్ని నిలిపివేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఉన్నాయా? ఏమైనా ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయా? అంబులెన్సుల్ని ఆపటం అనేది రాజ్యాంగ విరుద్ధమని తెలియదా? అంటూ తెలంగాణ పోలీసులకు ఒక రేంజ్ లో తలంటు పోసింది తెలంగాణ హైకోర్టు.

వైద్యం కోసం వస్తున్న వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం.. ఎట్టి పరిస్థితుల్లో అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని హైకోర్టు ఆదేశించింది. ఏమైనా.. హైకోర్టు స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.