Begin typing your search above and press return to search.

సీఎం డైన‌మిక్ అని విన్నామ‌న్న హైకోర్టు!

By:  Tupaki Desk   |   1 March 2019 5:08 AM GMT
సీఎం డైన‌మిక్ అని విన్నామ‌న్న హైకోర్టు!
X
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి డైన‌మిక్ అని విన్నాం.. ఆయ‌న త‌లుచుకుంటే కేవ‌లం 10 నిమిషాల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారంటూ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. హైకోర్టు నోటి నుంచి ఈ మాట‌లు ఎందుకు వ‌చ్చాయి? కేసీఆర్ ను డైన‌మిక్ సీఎం అన్న వ్యాఖ్య‌లు హైకోర్టు ఎందుకు చేసింది? ఏ కేసు విష‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు వ‌చ్చాయ‌న్న‌ది చూస్తే..

హైద‌రాబాద్‌ లోని క‌ల్యాణ్ న‌గ‌ర్ సొసైటీకి భూమి అప్ప‌గించే విష‌యం గ‌డిచిన 20 ఏళ్లుగా ప‌రిష్కారం కావ‌ట్లేదు. దీనికి సంబంధించిన వాజ్యం ఒక‌టి హైకోర్టులో ఉంది. దీనిపై విచారించిన కోర్టు.. విచార‌ణ‌లో భాగంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేసింది. సీఎం డైన‌మిక్ అని విన్నామ‌ని.. ఆయ‌న త‌లుచుకుంటే ఇది కేవ‌లం ప‌ది నిమిషాల్లో ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని పేర్కొంది.

ఇక‌.. క‌ల్యాణ్ న‌గ‌ర్ సొసైటీ వివాదంలోకి వెళితే.. సొసైటీ కింద 39 ఎక‌రాల భూమిని కొనుగోలు చేసి లేఔట్ కు అనుమ‌తులు తీసుకున్నారు. అయితే.. ఆ భూమిని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. మురికివాడ‌ల అభివృద్ధి కోసం స‌ద‌రు భూమి కావాల‌న్న ప్ర‌భుత్వం.. దానికి ప‌రిహారంగా అంతే మొత్తం భూమిని అప్ప‌గిస్తామ‌ని పేర్కొంది.

ఈ హామీ ఇచ్చి ద‌శాబ్దాలు కావొస్తున్నా.. నేటికి ప‌రిష్కారం దొర‌క‌ని ప‌రిస్థితి. ఈ ఇష్యూలో భాగంగా 1997లో ప్ర‌భుత్వం జీవోలు జారీ చేసింది. అయితే.. ఇవేమీ అమ‌లు కాని ప‌రిస్థితి. దీంతో సొసైటీ కోర్టు ధిక్కార‌ణ కింద పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో జ‌స్టిస్ ఆర్ ఎస్ చౌహాన్‌.. జ‌స్టిస్ అమ‌ర్ నాథ్ గౌడ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ ఇష్యూపై మ‌ధ్యాహ్నానికి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ రెవెన్యూ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజేశ్ తివారికి ఆదేశాలు ఇచ్చారు.

దీంతో.. ఆయ‌న హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వం వ‌ద్ద ఈ ఇష్యూ పెండింగ్ లో ఉంద‌ని అఫిడ‌విట్ లో పేర్కొన్నార‌ని.. ఎంత‌కాలం పెండింగ్ లో ఉంచుతార‌ని ప్ర‌భుత్వ అధికారిని హైకోర్టు ప్ర‌శ్నించింది.

దీనికి స్పందించిన తివారీ.. ఈ అంశంపై మంత్రిమండ‌లి నిర్ణ‌యం తీసుకోవాల‌ని.. రెవెన్యూ శాఖ ముఖ్య‌మంత్రి అధీనంలో ఉంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న ధ‌ర్మాస‌నం.. ఇత‌ర నాయ‌కుల కంటే మీ డైన‌మిక్ ముఖ్య‌మ‌త్రి చాలా ముందుంటార‌ని విన్నామ‌ని.. అధికారుల వైఫ‌ల్యంపై నిల‌దీస్తార‌ని భావిస్తున్నామ‌ని వ్యాఖ్యానించింది. ఆయ‌న త‌లుచుకుంటే ప‌ది నిమిషాల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని పేర్కొంది. ఎన్ని రోజుల్లో ఇష్యూను ప‌రిష్క‌రిస్తార‌ని కోర‌గా.. ఎనిమిది వారాల గ‌డువు కోరారు. అందుకు నోచెప్పిన కోర్టు నాలుగు వారాల్లో ఇష్యూ క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మ‌రి.. ఈ ఇష్యూపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.