Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పబ్ లకు హైకోర్టు షాక్.. తాజా ఆదేశం ఏమంటే?
By: Tupaki Desk | 13 Sep 2022 4:16 AM GMTహైదరాబాద్ పబ్ లకు దిమ్మ తిరిగిపోయే షాకింగ్ ఆదేశాల్ని జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. గడియారం ముల్లు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు నిర్విరామంగా సాగే భారీ సౌండ్లకు చెక్ పెట్టే ఆదేశాల్ని జారీ చేసింది.
హైదరాబాద్ పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రూల్ ఉదయం 6 గంటల వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనల్ని పాటించకుండా పబ్ లు నిర్వహిస్తున్నాయని.. రాత్రివేళ ప్రశాంతంగా ఉండనివ్వకుండా భారీ సౌండ్లు పెడుతున్నట్లుగా జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ తో సహా మర ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ తాజాగా సాగింది. తాము అధికారులకు విన్నవించుకున్నా.. పబ్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వారు వాపోయారు.
దీనిపై స్పందించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేస్తూ.. సౌండ్ కు చెక్ పెట్టేశారు. నగరపోలీస్ చట్టం.. సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత సమయం వరకే అనుమతి ఉందని.. విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు అనుమతి ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.
ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖను కౌంటర్ దాఖలు చేయాలని సూచన చేసింది. హైదరాబాద్ పరిధిలోని పబ్ లపై ఇప్పటివరకు దాఖలైన కేసుల వివరాల్ని తమకు అందజేయాలని హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు.
ఈ పబ్ లలో మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసేందుకు అనుమతి ఎంతమందికి ఉంది? లాంటిపలు వివరాల్ని అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తాజా ఆదేశాల నేపథ్యంలో పబ్ లు రాత్రి 10 గంటల నాటికి మ్యూజిక్ ను బంద్ చేస్తాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.