Begin typing your search above and press return to search.
లాయర్ల బంద్ పై ‘హైకోర్టు’ నోటీసులు
By: Tupaki Desk | 3 Aug 2016 5:27 AM GMTఈ మధ్యన తెలంగాణలోని జడ్జిలు.. లాయర్లు సమ్మె చేయటం తెలిసిందే. జడ్జిల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వెనక్కి తీసుకోవాలని.. హైకోర్టును విభజించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ ఆందోళనల్లో భాగంగా కొందరు అత్యుత్సాహంతో కోర్టుల్లో కుర్చీలు.. బల్లలు ధ్వంసం చేయటం.. కోర్టు విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. జడ్జిల మీద దాడులు చేసిన ఫిర్యాదులపై హైకోర్టు తాజాగా దృష్టి సారించింది. బంద్ లు.. నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలకు బాధ్యులైన వారిని గుర్తించి..వారిపై చర్యలకు హైకోర్టు ప్రయత్నాలు షురూ చేసింది.
జూన్ లో జరిగిన నిరసనల సందర్భంగా వివిధ కోర్టులలో చోటు చేసుకున్న ఘటనలపై హైకోర్టు సీరియస్ గా ఉంది. నిరసనల సందర్భంగా పలు జిల్లాల్లో కోర్టు ఆస్తుల్ని ధ్వంసం చేయటం.. కోర్టు కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై జిల్లాల వారీగా నివేదికలు హైకోర్టుకు పంపినట్లు చెబుతున్నారు. వీటిని పరిశీలించిన హైకోర్టు పరిపాలనా విభాగ కమిటీ.. కోర్టు విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవటానికి వీలుగా సుమోటోగా కోర్టు ధిక్కార చర్యల అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా పలువురు లాయర్లకు ఇప్పటికే నోటీసులు పంపించారు. కోర్టు ధిక్కార చట్టం కింద వారిపై ఎందుకుచర్యలు తీసుకోకూడదో వివరించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణను ఈ నెల 23న చేపట్టనున్నట్లుగా నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నోటీసుల్ని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్.. న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ లతోకూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. తాజా నోటీసులపై తెలంగాణ న్యాయవాద వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.