Begin typing your search above and press return to search.
అక్రమ మైనింగ్ కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
By: Tupaki Desk | 14 Jun 2022 3:30 PM GMTపశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరికి హైకోర్టు షాకిచ్చింది. గ్రావైల్ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు అబ్బయ్య చౌదరికి నోటీసులు జారీచేసింది.
అలాగే ఈపూరు, కలపర్రు, రాయన్నపాళెం, జగన్నాథపురం, సీతంపేట గ్రామాలకు చెందిన పలువురు వ్యక్తులకు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రావైల్ అక్రమ మైనింగ్ జరుగతోందని.. దీన్ని అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ సుగసాని గంగాధరరావు, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో అధికార వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. అక్రమంగా తవ్విన గ్రావెల్‌ను రోజూ భారీ వాహనాల్లో తరలిస్తున్నారని, తద్వారా రూ.కోట్ల ఆదాయం పొందుతున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ఈ వాహనాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఇలా జరిగిన నష్టాన్ని ప్రతివాదుల నుంచి వసూలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో ఈ మేరకు హైకోర్టు ధర్మాసం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి, తదితరులకు నోటీసులు జారీ చేసింది.
కాగా అబ్బయ్య చౌదరి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున దెందులూరు నుంచి గెలిచారు. ఇక్కడ అంతకుముందు అంటే 2009, 2014ల్లో గెలిచిన చింతమనేని ప్రభాకర్ ను అబ్బయ్య చౌదరి ఓడించి సంచలనం సృష్టించారు.