Begin typing your search above and press return to search.

ఆర్టీసీ స‌మ్మెపై హైకోర్టు ఏమందంటే...

By:  Tupaki Desk   |   28 Oct 2019 2:15 PM GMT
ఆర్టీసీ స‌మ్మెపై హైకోర్టు ఏమందంటే...
X
ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న స‌మ్మె నేప‌థ్యంలో ఈ రోజు హైకోర్టులో ఆర్టీసీ యాజ‌మాన్యం - కార్మిక‌ సంఘాల త‌ర‌పున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపించారు. ఈ వాద‌న‌ల్లో కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబట్టాయని - కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదని - చర్చలు జరపకుండానే యూనియన్ నేతలు బయటకు వెళ్లిపోయారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్‌ తరపు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

ఇక ఆర్టీసీ కార్మికుల మొత్తం 45 డిమాండ్ల‌లో కార్పొరేష‌న్‌ పై ఆర్థికంగా భారం ప‌డ‌ని 21 డిమాండ్ల‌పై ముందుగా చ‌ర్చ జ‌ర‌పాల‌ని హైకోర్టు తెలిపింది. ఈ 21 డిమాండ్ల‌పై ముందుగా చ‌ర్చ జ‌రిగితేనే కార్మికుల్లో ఆత్మ‌స్థైర్యం క‌లుగుతుంద‌ని కూడా న్యాయ‌స్థానం తెలిపింది. కోర్టు సూచ‌న‌లు ఎలా ఉన్నా అటు కార్మిక సంఘాలు మాత్రం విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆర్టీసీ యూనియ‌న్ నాయ‌కులు సైతం ఎలాంటి చ‌ర్చ‌లు లేకుండానే బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

ఇక ఆర్టీసీ త‌ర‌పున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తమ వాద‌న‌లు వినిపించారు. ఒక్క డిమాండ్ మీదే ప‌ట్టుబ‌ట్ట‌కుండా మిగిలిన డిమాండ్ల‌పై చ‌ర్చించ వ‌చ్చు క‌దా ? అని సూచించింది. ఒక్క విలీనం డిమాండ్ ప‌క్క‌న పెట్టి మిగిలిన డిమాండ్ల‌పై చ‌ర్చ జ‌ర‌పాల‌ని కోర్టు సూచించింది. అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ మాత్రం ముందుగా 21 డిమాండ్ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌న్న విష‌యాన్ని యూనియ‌న్ నాయ‌కులు ప‌ట్టించుకోలేద‌న్నారు. ఇక ఇరు వ‌ర్గాల మ‌ధ్య వివాదంతో సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్న విష‌యం కూడా హైకోర్టు ప్ర‌స్తావించింది.