Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ను వీడ‌ని జిల్లాల ర‌గ‌డ‌.. తాజాగా హైకోర్టుకు వివాదం!

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 AM GMT
జ‌గ‌న్‌ను వీడ‌ని జిల్లాల ర‌గ‌డ‌.. తాజాగా హైకోర్టుకు వివాదం!
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌ను జిల్లాల ర‌గ‌డ వ‌దిలి పెట్ట‌డం లేదు. ఇప్ప‌టికే కోన‌సీమ జిల్లా పేరు మార్పుపై తీవ్ర ర‌గ‌డ చోటు చేసుకుంది. జిల్లా పేరునుమార్చ‌డంపై  ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇంటి పై ఆందోళ‌న కారు లు విరుచుకుప‌డ్డారు. ఈ వివాదంపై ఇంకా ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో జిల్లాల వివాదం.. తెర‌మీదికి వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాను రెండుగా విభ‌జిస్తూ.. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న‌నిర్ణయంపై.. హైకోర్టులో తాజాగా పిటిష‌న్ దాఖ‌లైంది.

కొత్త‌గా ఏర్ప‌డిన నంద్యాల జిల్లాకు `ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి` పేరు పెట్టాలని కోరుతూ  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్రధమ తెలుగు స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ పేరును ప్రస్తుత ఉన్న నంద్యాల జిల్లలో జ‌న్మించార‌ని..  కాబట్టి నంద్యాల జిల్లాకు ఆయ‌న పేరు పెట్టాల‌ని పిటిష‌న్‌లో కోర్టును అభ్య‌ర్థించారు.

మొట్టమొదటిగా భారత్‌లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందు రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరుడని పేర్కొన్నారు. బ్రిటిష్ వారు ఆయ‌న‌ను  ఉరి తీసి కోట గుమ్మానికి 30 ఏళ్ల‌పాటు వేలాడ తీశార‌ని, అలాంటి  గొప్ప వీరుని పెరు నంద్యాల జిల్లాకు పెట్టడం సమంజసమని పేర్కొన్నారు.

ఈ విష‌యాన్ని ప్ర‌బుత్వానికి గ‌తంలోనే.. తాము ప్ర‌తిపాదించామ‌ని.. అయితే.. త‌మ అభ్య‌ర్థ‌న‌ను మాత్రం ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే హైకోర్టును ఆశ్ర‌యించిన‌ట్టు చెప్పారు.

2017లోనే డిమాండ్‌

2017లోనే జిల్లా లు విడిపోకముందు కర్నూలు జిల్లాకు ఉయ్యాల వాడ పెరు పెట్టాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దుష్టికి తాను తీసుకు వెళ్లిన‌ట్టుపిటిష‌న‌ర్ కేతిరెడ్డి కోర్టుకు తెలిపారు.. ఇప్పుడు కొత్త జిల్లాగా నంద్యాల ఏర్పాటు చేశార‌ని,  కాబట్టి ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని కోరారు.

ఆయ‌న‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చాల‌ని, ఉయ్యాల‌వాడ‌ విగ్రహాన్ని పార్ల‌మెంటులోనూ ఏర్పాటు చేయాల‌ని.. కోరిన‌ట్టు తెలిపారు.  దీనిని విచార‌ణ‌కు తీసుకున్న హైకోర్టు.. దీనికి సంబంధించి విచార‌ణ తేదీని నిర్ణ‌యిస్తామ‌ని పేర్కొంది.