Begin typing your search above and press return to search.

గణేషుడి విగ్రహాలకు హైకోర్టు పరిమితి

By:  Tupaki Desk   |   11 July 2016 10:57 AM GMT
గణేషుడి విగ్రహాలకు హైకోర్టు పరిమితి
X
వినాయకచవితి వస్తుందంటే చాలు.. హైదరాబాద్ లో ఆ సందడే వేరుగాఉంటుంది. ప్రతి గల్లీలో రెండుకు మించిన గణేష్ పండాలతో వీధులన్నీ సరికొత్తకళను సంతరించుకుంటాయి. గణేష్ నవరాత్రిళ్లు మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం పండుగ శోభతో శోభిల్లుతుంది. గణేష్ పండాల్లో ఏర్పాటు చేసే విగ్రహాలు కూడా పోటాపోటీగా ఉంటాయి. విగ్రహాల ఎత్తు మీద పోటీతో ఒకరికిమించి మరొకరన్నట్లుగా ఏర్పాట్లు చేస్తుంటారు. తాజాగా అలాంటి వాటిపై పరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

వినాయక విగ్రహాల ఎత్తు తగ్గించాలని చెప్పటమే కాదు.. వినాయక విగ్రహాలఎత్తు 15 అడుగులకు మించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది.పరిమితికి మించి విగ్రహాలు తయారు చేస్తున్నారని.. విగ్రహాలు 15 అడుగులకుమించి ఉన్నాయన్న అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. హైకోర్టు చెప్పినట్లే 15 అడుగులకు మించకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తారా? లేక..రివ్యూ పిటీషన్ వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. పరిమితికి మించిన విగ్రహాల కారణంగా పర్యావరణం దెబ్బ తింటుందన్న అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తంచేసింది. మరి.. ఈ అంశంపై భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి స్పందన ఎలాఉంటుందో..?