Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్: పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్ట్
By: Tupaki Desk | 31 Oct 2019 12:00 PM GMTపోలవరం .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్ట్. విశాఖపట్నం - ఉభయ గోదావరి - కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర గుర్తించింది. ఈ మహోన్నతమైన ప్రాజెక్ట్ 2004 లో ప్రారంభమైంది. ఆ తరువాత 2015లో జాతీయ ప్రాజెక్టు గా కేంద్రం గుర్తించింది. కానీ - పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ 55,548.87 కోట్ల భారీ వ్యయం తో నిర్మితమవుతుంది.
ఈ పోలవరం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పూర్తి మాత్రం కావడం లేదు. కానీ - గత ప్రభుత్వం దీనిపై నానా హుంగామా చేసాయి. కానీ , పనులని మాత్రం ముందుకి తీసుకోని పోలేకపోయింది. ఈ తరుణంలోనే ఎన్నికలు రావడం - ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. దీనితో వైసీపీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్స్ పై రివర్స్ టెండరింగ్ కి వెళ్తున్నట్టు తెలిపింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా సొమ్ము ఆదా అయింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది.
కానీ, మొదట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ హైకోర్టు ను ఆశ్రయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై విచారణ జరిపిన తరువాత రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేస్తూ పూర్తి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. దీనితో ప్రాజెక్టు నిర్మాణంపై కొత్త కాంట్రాక్టు సంస్థతో ముందుకెళ్లేందుకు హైకోర్టు ఇచ్చిన స్టే అడ్డంకిగా ఉంటూ వచ్చింది.
ఇక తాజాగా హైకోర్టు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పై ఇచ్చిన స్టేను ఎత్తేసింది. దీనితో పోలవరం నిర్మాణ పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అయ్యింది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసినట్టుగా కోర్టు ప్రకటించింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్ కు విలువ ఉండదన్న ఏజీ వాదనతో ఏకీ భవించిన హైకోర్టు స్తే ఎత్తేసింది. ఇరు పార్టీల వాదనలు విన్న హై కోర్ట్ కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో వైసీపీ తన పంతం గెలిపించుకున్నట్టు అయ్యింది. ఇక వైసీపీ చెప్పినట్టుగా ఈ పోలవరాన్ని 2021 నాటికీ పూర్తి చేసి వాడుకలోకి తెస్తే వైసీపీకి ఇక తిరుగుండదు.