Begin typing your search above and press return to search.
రోజాపై హైకోర్టు తీర్పు ఇవ్వాల్టికి లేదు
By: Tupaki Desk | 21 March 2016 1:20 PM GMTఆర్కే రోజా సస్పెన్షన్ వివాదం ఆసక్తికరమైన మలుపు తిరిగింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఉదంతంపై హైకోర్టు ధర్మాసనం తన తీర్పును వెలువరించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏపీ అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్ పై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం స్టే ఇవ్వటం.. దీనిపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయటం తెలిసిందే. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఆర్కే రోజాను ఏపీ అసెంబ్లీలోకి అనుమతించకపోయిన నేపథ్యంలో.. సోమవారం ఈ విషయంపై హైకోర్టు తన తీర్పును చెబుతుందన్న ఆసక్తి వ్యక్తమైంది.
సోమవారం ఆర్కే రోజా వివాదంపై ఇరు పక్షాలు తమ వాదనను వినిపించాయి. ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన స్టేకు అనుగుణంగా సభకు అనుమతించని ఏపీ అసెంబ్లీ.. తాజాగా భిన్నమైన వాదనను వినిపించారు. న్యాయవ్యవస్థతో ఘర్షణాత్మక వైఖరి కంటే.. శాసనసభ మర్యాదను కాపాడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేసేలా తన వాదనను వినిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఏపీ అసెంబ్లీలోకి రోజాను అనుమతించాలంటే.. ఆమె తొలుత క్షమాపణలు చెప్పాలన్న వాదనను వినిపించారు.
మరోవైపు.. పిటీషనర్ తప్పు చేయలేదు కనుక క్షమాపణలు చెప్పేది లేదని రోజా తరఫు న్యాయవాది తన వాదనను న్యాయస్థానానికి వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. ఈ అంశంపై తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.