Begin typing your search above and press return to search.

ఇసుక కేసులు ఇలానా పెట్టేదంటున్న హైకోర్టు

By:  Tupaki Desk   |   6 Dec 2015 4:39 AM GMT
ఇసుక కేసులు ఇలానా పెట్టేదంటున్న హైకోర్టు
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద రాష్ట్ర హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారి విషయంలో ప్రభుత్వాధికారులు అనుసరిస్తున్న వైఖరి మీద అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ విషయాలపై పలు ప్రశ్నల్ని సంధించటమే కాదు.. కేసులు పెట్టే విషయంలో ఈ తీరు ఏమిటంటూ ప్రశ్నించింది.

ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి.. తనిఖీల్లో పట్టుబడిన వారి విషయంలో అనుసరించే వైఖరిపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పట్టుబడిన వారి విషయంలో కేసులుపెట్టే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించింది. కేసుల విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలన్న హైకోర్టు.. బెయిల్ బుల్ కేసులు పెట్టటం కాదు.. నాన్ బెయిల్ బుల్ కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించటం గమనార్హం.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయంలో పెట్టిన కేసులు..ఆ వివరాలు తమకు అందజేయాలంటూ తెలంగాణ సర్కారును హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. అక్రమ రవాణాకు పాల్పడిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల విషయంలోనూ నిబంధనలు పాటించలేదంటూ మండిపడింది. ఇసుక అక్రమ రవాణా సమాజ మనుగడకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని.. ఈ నేరాల విషయంలో మరింత కఠినంగా ఉండాలన్న విషయాన్ని తాజా స్పందన ద్వారా హైకోర్టు చెప్పినట్లైంది.