Begin typing your search above and press return to search.

వివేకా హత్య : సీల్డ్ కవర్ లో నివేదిక కోరిన హైకోర్టు!

By:  Tupaki Desk   |   17 Dec 2019 8:42 AM GMT
వివేకా హత్య : సీల్డ్ కవర్ లో నివేదిక కోరిన హైకోర్టు!
X
మాజీ సీఎం వై ఎస్ తమ్ముడు - ప్రస్తుత సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ - మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికలు కొద్దిరోజుల్లో ఉన్నాయి అనగా - పులివెందులలోని తన ఇంట్లోనే దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. రాత్రి వరకు ప్రచారంలో మునిగితేలిన వివేకా ..తెల్లవారేసరికి రక్తపు మడుగులో శవమై కనిపించారు. ఈ కేసు పై గత ప్రభుత్వం మొదట్లో కొంత ప్రత్యేక శ్రద్ద పెట్టినప్పటికీ .. ఆ తరువాత ఈ కేసు ని పక్కన పెట్టేసారు. ఆలోగా జరిగిన ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ..ఈ కేసు విచారణలో వేగం పెరిగింది.

ప్రస్తుత వివేకా హత్య కేసుని సిట్ విచారిస్తుంది. అందులో బాగంగా అనేక మందిని సిట్ విచారించింది. విచారణలో భాగంగా పులివెందులకు చెందిన బీటెక్ రవితో పాటుగా జమ్మలమడుగు నేత..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సైతం విచారించింది. అయితే, హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని..ఈ హత్యతో తనకు ఏ మాత్రం సంబంధం ఉందని తేలితే.. ఎన్ కౌంటర్ చేయమని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే వివేకా హత్య చేసిందెవరో..ఇంటి దొంగలకు తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో హత్య సమయంలో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందున్న పరమేశ్వర రెడ్డిని సైతం సిట్ తాజాగా విచారించింది. త్వరలోనే వాస్తవాలను బయట పెడతామని సిట్ అధికారులు చెబుతున్నారు.

ఇకపోతే ఈ కేసు విచారణలో భాగంగా సిట్ ముందు కి వచ్చిన బీటెక్ రవి ..కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని చెబుతూనే..ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టులో విచారణ సాగింది. దీని పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 లోపు కేసు దర్యాప్తు నివేదిక ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది.