Begin typing your search above and press return to search.

పరిటాల శ్రీరామ్ కు షాకిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   6 Sep 2018 8:03 AM GMT
పరిటాల శ్రీరామ్ కు షాకిచ్చిన హైకోర్టు
X
అధికార టీడీపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. వైసీపీ కార్యకర్తపై దాడి ఆరోపణల కేసులో ఆయనకు హైకోర్టు షాకిచ్చింది. శ్రీరామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అనంతపురం జిల్లా రామగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 7న పేరూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం పెట్టారని తెలిసి పరిటాల శ్రీరామ్ తోపాటు మరికొందరు తన ఇంటికొచ్చి మారణాయుధాలతో దాడి చేశారని రామగిరికి చెందిన వైసీపీ కార్యకర్త బోయలక్కెనగారి నారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. మంత్రి కుమారుడు కావడంతో తాను ఫిర్యాదు చేసినా పోలీసులు ఫిర్యాదు పట్టించుకోలేదని వాపోయాడు..

నారాయణ వేసిన పిటీషన్ పై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని రామగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాగా ఇదే ఘటనపై వైసీపీ నేత బోయ సూర్యం స్పందించాడు. పరిటాల శ్రీరామ్ తన అనుచరులు మాదాపురం శంకర్, కొత్త పల్లి శివశంకర్ తదితరులతో వచ్చి మారణాయుధాలతో బెదిరించారని.. ఈ విషయమై అనంతపురం జిల్లా ఎస్పీకి తన ఫిర్యాదును రిజిస్టర్ పోస్టులో పంపానని మీడియాకు వెల్లడించారు. వైసీపీ సమావేశం పెట్టినందుకు చిత్రహింసలకు గురిచేసి చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ దాడిలో తన చేయి విరిగిందని.. దానికి ఆస్పత్రికి తీసుకెళ్లి కట్టుకట్టించారని సూర్యం ఆరోపించారు. పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు.