Begin typing your search above and press return to search.
అసెంబ్లీకి వెళ్లినందుకు ఎమ్మెల్యేకు జరిమానా
By: Tupaki Desk | 24 Aug 2017 1:14 PM GMTఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో రోజూ అసెంబ్లీకి హాజరైనందుకు ఆ మాజీ ఎమ్మెల్యేకు ఇప్పుడు కోర్టు జరిమానా విధించింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎమ్మెల్యేగా పనిచేయడం, అసెంబ్లీకి వెళ్లడం తప్పు కాకపోయినా ఆయన ఎన్నికే తప్పు కావడంతో ఆయనకు ఈ జరిమానా పడింది. ఇంతకీ ఇలా అసెంబ్లీకి వెళ్లినందుకు జరిమానా కట్టాల్సిన పరిస్థితులు తెచ్చుకున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఆయన శత్రుచర్ల విజయరామరాజు.
మాజీ మంత్రి - తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజుకు ఉమ్మడి హైకోర్టు భారీ షాకిచ్చింది. రూ.2.25 లక్షల జరిమానా విధించింది. ఆ సొమ్మును నాలుగు వారాల్లో హైకోర్టు రిజిస్ట్రార్ పేరుమీద జమ చేయాలని ఆదేశించింది.
శత్రుచర్ల 1999 నుంచి 2004 వరకు నాగూరు ఎస్టీ శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే... అక్కడి మాజీ శాసనసభ్యడు నిమ్మక జయరాజు శత్రుచర్ల ఎన్నికపై హైకోర్టు లో కేసు వేశారు. ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శత్రుచర్ల అసలు గిరిజనుడు కాదన్నది ఆయన వాదన. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శత్రుచర్ల కొండదొర కాదని, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో శత్రుచర్ల శాసనసభ్యునిగా కొనసాగిన కాలానికి చెల్లించిన జీతభత్యాలను తిరిగి రాబట్టేలా ఆదేశించాలని, ప్రాసిక్యూటర్ చేయాలని అభ్యర్థిస్తూ జయరావు మళ్లీ కేసు వేశారు. దాని ఫలితమే ఈ తాజా షాక్.
శాసనసభ్యునిగా 1999 నుంచి 2004 వరకు పనిచేసిన కాలానికి, సమావేశాలకు హాజరైన ఒక్కొ సిటింగ్ కు రూ.500 చొప్పున జరిమానా చెల్లించా లని శత్రుచర్లను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జీ వెలువరించిన తీర్పుపై స్టే విధించేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవి లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.