Begin typing your search above and press return to search.
`ఆ శిక్ష` తప్పదు.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు ఆదేశం
By: Tupaki Desk | 13 April 2022 4:30 PM GMTసీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఏపీ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్ట్ తీర్పును అమలు చేయనందుకు సేవా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విద్యాలయ ప్రాంగణాల్లో ఆర్‌బీకేలు.. గ్రామ సచివాలయాల నిర్మాణం చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కార చర్యల్లో భాగంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు రెండు వారాల జైలుశిక్ష విధించింది.
కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురైన శ్రీలక్ష్మి అక్కడికక్కడే క్షమాపణ చెప్పడంతో ఆ శిక్షను సేవగా మారుస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడాది పాటు నెలకో రోజు ప్రభుత్వ వసతి గృహాల్లో సేవ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కానీ.. ఈ సేవ శిక్ష విషయంలో పునఃసమీక్ష చేయాలంటూ శ్రీలక్ష్మి తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తొలుత విచారణకే స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించగా.. తాజాగా శ్రీలక్ష్మి తరఫు న్యాయివాది వివరణతో పిటిషన్‌ను విచారణకు అనుమతించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసింది.
ఏం జరిగిందంటే..
నవ్యాంధ్ర హిస్టరీలోనే.. ఫస్ట్ టైం.. ఒకేసారి.. ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్‌లకు.. ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సీనియర్ ఐఏఎస్ అదికారులు.. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం ఎం నాయక్ ల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావిస్తున్నట్టు రాష్ట్రహైకోర్టు స్పష్టం చేసింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.. ఇది మంచిదే అయినప్పటికీ.. వీటికి సంబంధించిన కార్యాలయాల ఏర్పాటులో మాత్రం ప్రబుత్వం ఎక్కడా నిబంధనలు పాటించలేదు.
పాఠశాలల్లో సైతం సచివాలయాలను ఏర్పాటు చేశారు. దీనిపైఏడాది కిందటే పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా అంశాలపై విచారణ జరిపిన కోర్టు.. స్కూళ్లలో సచివాలయాల ఏర్పాటును తిరస్కరించింది. మూడు మాసాల్లో వాటిని తీసేసి.. పాఠశాలలను కేవలం విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని సూచించింది.
అయితే. ఎన్నాళ్లు గడిచినా.. ఈ నిర్ణయంపై అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి కోర్టులో ధిక్కరణ వ్యాజ్యం పడింది. దీనిని కూడా రెండు దఫాలుగా విచారించిన కోర్టు గతంలోనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుడితి రాజశేఖర్‌ను కోర్టుకు పిలిపించి మరీ హెచ్చరించింది. అయినప్పటికీ.. మార్పు రాలేదు. దీంతో తాజాగా జరిగిన విచారణలో విద్యా వ్యవస్థలకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకుంటూ.. ఆదేశాలు జారీ చేసింది.
8 మంది ఐఏఎస్‌లకు...రెండు వారాలపాటు హైకోర్టు జైలు శిక్ష విధించడంతో వారంతా.. కోర్టుకు క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించిన కోర్టు వారిని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లకు హైకోర్టు తెలిపింది. ఇది రోజుకు రూ.5 లక్షలకు పైగానే ఉందని తెలిసింది. దీనిని రద్దు చేయాలనే శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించారు.