Begin typing your search above and press return to search.
ఆనందయ్య మందుపై హైకోర్టు కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 27 May 2021 11:30 AM GMTప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకు మందు లేదు. వేసుకుందామంటే వ్యాక్సిన్లు లేవు. అదేదో ఆకులు అలములతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నివాసి ఆనందయ్య తగ్గిస్తున్నాడు. అయితే ఆ మందు ఫేమస్ కావడంతో దాన్ని నిగ్గుతేల్చేందుకు ఏపీ సర్కార్ నిలిపివేయించింది. ఐసీఎంఆర్ పరిశోధన తర్వాతే దానికి అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజాగా ఈ మందు పంపిణీ చేపట్టాలని కొందరు ఏపీ హైకోర్టు తలుపుతట్టారు. ఈ క్రమంలోనే హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని.. వీలైనంత త్వరగా దీనిపై నివేదికలు తెప్పించుకొని తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీ ఆయుష్ శాఖ ఈ మందు వల్ల దుష్ప్రభావాలు లేవని తేల్చారు.
ఈ క్రమంలోనే ఈనెల 29వ తేదీని నాటికి ఆనందయ్య మందుపై నివేదికలు వస్తాయని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. దీనికి స్పందించిన హైకోర్టు ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని.. వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు పేర్కొంది. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి? మందుపై అభిప్రాయం ఏంటో తమకు తెలుపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.
అయితే ప్రస్తుతం కేంద్రం పరిధిలో ఆనందయ్య ఆయుర్వేద మందు విషయం ఉంది. కేంద్ర ఆయుష్ శాఖ దీనిపై పరిశోధిస్తోంది. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆనందయ్య మందు పంపిణీ మొదలవుతుంది. ఏపీ సర్కారే దీన్ని తయారు చేసి అందించే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.