Begin typing your search above and press return to search.

బాబుకు షాక్.. ఏలేరు స్కాంకు హైకోర్టు విచారణ

By:  Tupaki Desk   |   9 Jan 2019 7:22 AM GMT
బాబుకు షాక్.. ఏలేరు స్కాంకు హైకోర్టు విచారణ
X
ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఇరకాటం పడ్డారు. ఇంతవరకు తనపై ఎన్ని కేసులు నమోదైనా.. కోర్టులో పిటీషన్లు పడ్డా వాటిని తనదైన శైలిలో మేనేజ్ చేసుకొని క్లీన్ చిట్ తెచ్చుకునే బాబుకు తొలిసారి హైకోర్టు ఇచ్చిన జలక్ తో కుడిదిలో పడ్డ ఎలుకలా పరిస్థితి మారింది.

తాజాగా ఏలేరు కుంభకోణం టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడింది. ఎప్పుడో 1996లో అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఏలేరు భూముల పరిహారం కుంభకోణంలో ఫిర్యాదు ఆధారంగా తాజాగా దర్యాప్తు చేయాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తికాగానే కోర్టులో చార్జిషీట్ తక్షణమే వేయాలని కోర్టు గడువు విధించింది.

ఏలేరు భూములకు ధర పెంచి అక్రమంగా నష్టపరిహారం పెంచి కోట్లు కొల్లగొట్టారని 1996లోనే సీఎంగా ఉన్న బాబుపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు సంతకాలు చేసి నిధుల దుర్వినియోగం చేశారని.. రైతులకు ఎగ్గొట్టారని.. తక్కువ చెల్లించి దోచుకున్నారని కోర్టుల్లో పిటీషన్లు దాఖలయ్యాయి.. అయితే ఈ కుంభకోణంపై ఫిర్యాదుకు సాంకేతిక సమస్య ఏర్పడి కేసు చాలా ఏళ్లుగా పెండింగ్ లో పడిపోయింది. తాజాగా హైకోర్టు ఆ సాంకేతిక సమస్య తొలగించింది.

దీంతో ఏలేరు కుంభకోణానికి బాధ్యులైన వారిపై విచారణకు అవకాశం దక్కింది. అయితే చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉండే సీఐడీ ఎంతవరకు బాబుపై విచారణ జరిపి ఆయన్ను బోనులో నిలబెడుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.