Begin typing your search above and press return to search.

జగన్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా..ఈసారైనా మినహాయింపు ఇచ్చేనా?

By:  Tupaki Desk   |   12 Feb 2020 12:00 PM GMT
జగన్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా..ఈసారైనా మినహాయింపు ఇచ్చేనా?
X
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే , జగన్‌ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలుపుతూ కౌంటర్‌ దాఖలు చేసింది. ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది. జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని - మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేసారు. సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.

సీఎం హోదాలో అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉంటడం వల్ల - ప్రతి వారం విచారణకు రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయని .. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్నందున తన బదులు న్యాయవాది అశోక్‌ రెడ్డి హాజరయ్యేలా అనుమతివ్వాలని జగన్‌ పిటిషన్‌ లో కోరారు. అలాగే, తన వ్యక్తిగత హాజరు తప్పనిసరని కోర్టు ఆదేశించినప్పుడు హాజరుకు సిద్ధమని చెప్పినా.. కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఎం జగన్ తన పిటిషన్ లో వివరించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపుపై గతంలో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను సిబిఐ కోర్టు తిరస్కరించడంతో సీఎం జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు.