Begin typing your search above and press return to search.
రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
By: Tupaki Desk | 24 Jun 2015 6:30 AM GMTఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి బెయిల్ ఇవ్వడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి బెయిల్ మంజూరు కోసం దాఖలైన పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. రేవంత్ బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగిన సమయంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్ర, ఇతర అంశాల గురించి గతంకంటే కొంత సమాచారం అందిందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో తాజాగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు వినిపించేందుకు వారం రోజుల గడువు కావాలని ఆయన కోరినప్పటికీ రెండు రోజులు సమయం ఇస్తూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.