Begin typing your search above and press return to search.
మాచర్ల దాడి ఘటన పై డీజీపీ ఏంచెప్పారంటే ?
By: Tupaki Desk | 14 March 2020 9:15 AM GMTఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న ,బోండా ఉమాలపై దాడి ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది . నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారని నామినేషన్ పత్రాలు చించి వేశారని , దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ఘటన నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు గవర్నగర్ బిస్వభూషణ్ హరిచందన్ కు అలాగే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు .రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
ఇక ఈ ఘటనపై హై కోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సైతం డీజీపీని కోర్టుకు పిలిచి మరీ విచారణ జరిపింది. ఇకపోతే , ఈ ఘటన తరువాత డీజీపీ గౌతమ్ సవాంగ్ అసలు సంఘటనపై నివేదిక కావాలని, సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ సవాంగ్ గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ ఈ ఘటన పై పూర్తి నివేదిక ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతి పక్ష పార్టీ సహా అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని , వచ్చిన అన్ని ఫిర్యాదులపైన తక్షణమే విచారణ జరిపిస్తున్నామని చెప్పిన ఆయన అంతే కాక ఘటన వివరాలు ,దర్యాప్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందిస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటన పైన సెక్షన్ 307 కింద నమోదు చేయలేదని ప్రతిపక్ష పార్టీల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. మాచర్ల ఘటనపై సెక్షన్ 307 కింద నిందితులను అరెస్టు చేశామని ప్రస్తుతము గురజాల సబ్-జైల్లో ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు నిందితులు ఉన్నారని , పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే వెళ్లామని టిడిపి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న చెప్పారని దాని మీద కూడా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. న్నికల దృష్టా పోలీసులు అన్నివేళల అప్రమత్తంగా ఉన్నారని, ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.