Begin typing your search above and press return to search.
జగన్ కంటే జడ్జిలే నయం
By: Tupaki Desk | 10 Feb 2016 9:47 AM GMT తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాల్లో నిబంధనలను పక్కనపెట్టి ప్రజాప్రతినిధుల కంటే పార్టీ ప్రతినిధులకే పెద్ద పీట వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జులు ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వారే అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారట. పార్టీ, ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే... ఇంత జరుగుతున్నా.... పాలక పక్షం పూర్తిగా డామినేట్ చేస్తున్నా విపక్ష నేత జగన్ మాత్రం దానిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ పథకాల విషయంలో మంత్రులు - జన్మభూమి కమిటీ సభ్యులు - అధికార పార్టీ కార్యకర్తలు కలిసి జాబితాలు తయారుచేస్తుండడంతో స్థానిక విపక్ష ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారుతున్నారట. దీనిని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినా ఆయన ఏమత్రం స్పందించలేదని సమాచారం.
వృద్ధాప్య పింఛన్ల విషయంలో కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలే జాబితాలు చేయడంతో కొందరు వృద్ధులు - వికలాంగులు - వితంతువులు నష్టపోయారట... వారంతా హైకోర్టులో ఫిటీషన్ దాఖలు చేశారు. అధికార పార్టీకి చెందిన వారు వద్దన్న కారణంగానే తమ పెన్షన్లను రద్దుచేశారని వాళ్లు కోర్టుకు నివేదించారు. సాక్ష్యాధారాలు సమర్పించారు. వారి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అర్హులైన వారిలో కొందరికి పెన్షన్ లు రద్దుచేయడం అంటే వాళ్లను ఆకలితో చావమనా ప్రభుత్వ ఉద్దేశం అని మండిపడ్డారు. కొందరికి ఇచ్చి కొందరికి పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నట్టు? ఈ వివక్ష దేనికి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు.. తమ పార్టీ అధినేత కంటే జడ్జిలే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారని అంటున్నారు.