Begin typing your search above and press return to search.
టీడీపీకి షాక్ఃసుమోటో కేసుగా కమిషనర్ పై దాడి
By: Tupaki Desk | 23 April 2017 4:59 AM GMTతెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడలో గత నెలలో టీడీపీ నేతలు రవాణా శాఖ అధికారులపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన ఉదంతాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 25వ తేదీన ఈ కేసును విచారించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ - జస్టిస్ షామీమ్ అక్తర్ ధర్మాసనం నిర్ణయించింది. పత్రికల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న ఈ వార్తను సుమోటోగా హైకోర్టు స్వీకరించిన పరిణామం టీడీపీకి - ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ అని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం - ఆయన భద్రతా సిబ్బంది - ఆఫీసు సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా వారిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని - ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు - ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న - సిటీ మేయర్ కోనేరు శ్రీధర్ - ఏపీ పోలీసుహౌసింగ్ బోర్డు చైర్మన్ ఎస్‌కె నాగుల్ మీరా దుర్భాషలాటినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును పలువురు తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో మార్చి 27వ తేదీన జరిగిన ఈ ఉదంతంపై పార్టీ అధినేత - సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. తన పార్టీ నేతలకు క్లాస్ తీసుకోవడంతో వారు రవాణా శాఖ కమిషనర్ కు క్షమాపణలు తెలిపారు. అయితే పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో సుమోటోగా కేసును స్వీకరించడం టీడీపీకి - ఏపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/