Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ కేసులో కొనుగోలుదారులకు ఊరట

By:  Tupaki Desk   |   6 Sep 2020 1:30 PM GMT
అగ్రిగోల్డ్ కేసులో కొనుగోలుదారులకు ఊరట
X
ఏపీలో అగ్రిగోల్డ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. చాలా మంది ప్రజల వద్ద డిపాజిట్లు సేకించి ఉడాయించిన అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.

అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంతో ముడిపెడుతూ ఆ కంపెనీ నుంచి గతంలో ఆస్తులు కొనుగోలు చేసిన పలువురికి అద్దె చెల్లించాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను ఉన్న హైకోర్టు రద్దు చేసింది. ఈ తరహా తాఖీదుల జారీ చట్ట విరుద్ధమని పేర్కొంది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తిని జప్తు చేయడమంటే దానిని ఇతరులకు విక్రయించకుండా తాకట్టుపెట్టకుండా నిలువరించడానికే గానీ వాటిపై అద్దె వసూలు చేయడానికి కాదని పేర్కొంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫార్చూన్ హేలాపురి అపార్ట్ మెంట్ ఓనర్స్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ ఏడాది జూన్ లో జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది.