Begin typing your search above and press return to search.

టీడీపీ దొంగెత్తులకు చెక్ పెట్టిన హైకోర్టు

By:  Tupaki Desk   |   17 March 2017 7:59 AM GMT
టీడీపీ దొంగెత్తులకు చెక్ పెట్టిన హైకోర్టు
X
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని అవకాశాలనూ ఉపయోగించుకునే క్రమంతో తెలివితేటలు ప్రదర్శించిన టీడీపీని హైకోర్టు అడ్డుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో పదిమంది ఓటర్లుకు సహాయకుల కోసం (కంపానియన్‌ ఓటు) టీడీపీ కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు శుక్రవారం దాన్ని తిరస్కరించింది. గడువులోపుగా దరఖాస్తు చేసుకోలేనందున పిటిషన్‌ ను తిరస్కరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ కు సరిపడా ఓట్లు లేని టీడీపీకి ఆదిలోనే షాక్ తగిలినట్లయింది.

చట్టంలో లొసుగులు ఆధారం చేసుకొని లబ్ధిపొందాలనే దిశగానే టీడీపీ ఈ ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే తెలుగు తమ్ముళ్లు దృష్టి కంపానియన్‌ ఓటుపై పడిందని.. ఫారం 14ఏ ప్రకారం నిరక్షరాస్యులు - తీవ్ర అనారోగ్యవంతులు - అంధులు కంపానియన్‌ ఓటు పొందే అవకాశం ఉండడంతో దాన్ని అడ్డంబెట్టుకుని కంపానియన్‌ ఓటు కోసం గట్టి ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. దాదాపు 47మంది ఓటర్లకు కంపానియన్‌ ఓటు కావాలంటూ టీడీపీ నేతలు దరఖాస్తులు చేశారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసిన అనంతరం ఈమెయిల్‌ ద్వారా పంపించారు. పలువురు సభ్యులు తమకు ఓటేస్తారో లేదో అన్న అనుమానంతో వారికి బదులు ఇతరులను పంపించి వేయాలన్నది ఈ వ్యూహం. అయితే టీడీపీ ఎత్తుగడలకు ఈసీ చెక్‌ పెట్టింది. వారు ఈ-మెయిల్‌ ద్వారా సమర్పించిన 47 దరఖాస్తులను తిరస్కరించింది. అయినప్పటికీ టీడీపీ నేతలు గురువారం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన 10మందికి అయినా కంపానియన్‌ ఓటు సౌకర్యం కల్పించాలని కోరారు. అయితే ఈసీ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థిస్తూ టీడీపీ పిటిషన్‌ కొట్టేసింది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 841 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కేవలం పదిమంది మాత్రమే నిరక్షరాస్యులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/