Begin typing your search above and press return to search.

ఐల‌య్య కేసుపై హైకోర్టు రియాక్ట్ అయ్యింది

By:  Tupaki Desk   |   4 Oct 2017 9:52 AM GMT
ఐల‌య్య కేసుపై హైకోర్టు రియాక్ట్ అయ్యింది
X
త‌న పుస్త‌కంతో కొత్త ర‌చ్చ‌కు తెర తీశారు ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య‌. సామాజిక వేత్త‌గా.. ప‌లు అంశాల‌పై భిన్న‌వైఖ‌రితో పుస్త‌కాలు రాస్తార‌న్న పేరున్న ఐల‌య్య.. సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అంటూ రాసిన పుస్త‌కంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్య‌వైశ్యులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఐల‌య్య పుస్త‌కం రాయటాన్ని కొంద‌రు బ‌హుజ‌నులు మ‌ద్ద‌తు ఇవ్వ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌టం.. సామాజిక అశాంతికి కార‌ణ‌మ‌య్యేలా పుస్త‌కాలు రాయ‌టాన్ని ఆర్య‌వైశ్య వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. త‌మ మ‌నోభావాల్ని దెబ్బ తినేలా పుస్త‌కం రాసిన ఐల‌య్య‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ వైశ్యులు ప‌లువురు కోర్టులను ఆశ్ర‌యిస్తున్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లైంది. విదేశాల నుంచి అక్ర‌మంగా వ‌స్తున్న నిధులతో పుస్త‌కాల రూపంలో హిందుత్వంపై దాడికి పాల్ప‌డుతున్నార‌ని.. ఆయ‌న తీరుపై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాలని కోరింది. ప్ర‌పంచ ఆర్య‌వైశ్య మ‌హాస‌భ అధ్య‌క్షుడు టంగుటూరి రామ‌కృష్ణ ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు.

ప్రొఫెస‌ర్ గా త‌న సామాజిక బాధ్య‌త‌ను ఐల‌య్య మ‌ర్చిపోతున్నార‌ని.. రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా రామ‌కృష్ణ మండిప‌డ్డారు. రామ‌కృష్ణ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు న్యాయ‌మూర్తి కోదండ‌రాం ఒక సందేహాన్ని లేవ‌నెత్తారు. ఇలాంటి అంశాలపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించొచ్చా? అన్న విష‌యాన్ని పిటిష‌న‌ర్‌ ను అడిగారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఈ కేసు విచార‌ణ‌ను 16కు వాయిదా వేశారు. అదే స‌మ‌యంలో కంచ ఐల‌య్య‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ దాఖ‌లు చేసిన మ‌రో పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 12కు వాయిదా వేశారు. ఆ పిటిష‌న్ను ప్ర‌కాశం జిల్లా పెద్ద‌గొల్ల‌ప‌ల్లికి చెందిన వత్స‌ల దాఖ‌లు చేశారు. వివాదాస్ప‌ద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఐల‌య్య కార‌ణంగా శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లుగుతుంద‌ని ప్ర‌పంచ ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ప్ర‌తినిధులు డీజీపీ అనురాగ్ శ‌ర్మ‌కు ఫిర్యాదు చేశారు. ఐల‌య్య ఒక సామాజిక ఉగ్ర‌వాది అని.. ఆయ‌న‌కు విదేశీ సంస్థ‌ల‌తో ఉన్న సంబంధాల‌పై ద‌ర్యాప్తు జ‌రిపించాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. ఐల‌య్య‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని ఆయ‌న పుస్త‌కాన్ని నిషేధించాల‌ని కోరుతూ అంత‌ర్జాతీయ వైశ్య ఫెడ‌రేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా కోరారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్య‌వైశ్య స‌భ నేతృత్వంలో మొద‌లైన పాద‌యాత్ర అంశంలో వైశ్యులు రెండుగా చీలిపోయారు. ఒక పాద‌యాత్ర‌కు ఆర్య‌వైశ్య చైత‌న్య పోరాట స‌మితి అధ్య‌క్షుడు ప్రేమ్ కుమార్ గాంధీ నేతృత్వం వ‌హిస్తుంటే.. మ‌రో పాద‌యాత్ర‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్ అధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. అయితే.. వీరి పాద‌యాత్ర‌కు స‌రైన అనుమ‌తులు తీసుకోలేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స‌రైన అనుమ‌తులు తెచ్చుకొని మ‌ళ్లీ పాద‌యాత్ర‌ను షురూ చేశారు. చూస్తుంటే.. ఐల‌య్య ఇష్యూను వైశ్యులు అంత తేలిగ్గా వ‌దిలేలా క‌నిపించ‌ట్లేదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు కంచె ఐల‌య్య అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిన మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ఐల‌య్య ఎలా స్పందిస్తారో చూడాలి.