Begin typing your search above and press return to search.
సొంత ఊర్లోకి వెళ్లటానికీ గుర్తింపు కార్డులట
By: Tupaki Desk | 24 Sep 2016 6:22 AM GMTతెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా తమ దృష్టికి వచ్చిన అంశంపై తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో పాటు.. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే కొన్ని గ్రామాల వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పరిహారంతో ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు తెలంగాణ సర్కారు విపరీతంగా ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా కొన్ని గ్రామాల వారు తమ భూముల్ని ఇచ్చేందుకు సిద్ధం కాగా.. మరికొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలా వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో వేముల ఘాట్ ఒకటి. ఇక్కడి వారు మల్లన్నసాగర్ ప్రాజెక్టును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే.. గ్రామంలో 144వ సెక్షన్ ను గత కొద్ది నెలలుగా అమలు చేస్తున్నారు.
తమ గ్రామంలో సెక్షన్ 144ను అమలు చేయటాన్ని ప్రశ్నిస్తూ పలువురు పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణను ఇప్పటికే పలుమార్లు చేపట్టిన హైకోర్టు.. తాజాగా మరోసారి విచారించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన ఫిర్యాది న్యాయవాది.. సొంత ఊర్లో వెళ్లటానికి అక్కడి గ్రామస్తులు గుర్తింపు కార్డులు చూపించాలంటూ అధికారులు కోరుతున్నారని.. ఇదెంత వరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సొంత గ్రామంలోకి వెళ్లేందుకు కూడా పోలీసులకు గుర్తింపు కార్డులు చూపించాలా? ఇదేం పద్ధతి? అంటూ నిలదీశారు. ఏమైనా సొంత ఊర్లోకి నిత్యం వెళ్లే వారు.. రోజూ గుర్తింపు కార్డులు చూపించాల్సి రావటానికి మించిన ఇబ్బంది ఇంకేం ఉంటుంది..?