Begin typing your search above and press return to search.
ఫోన్ ట్యాపింగ్ కేసు: 16మందికి హైకోర్టు నోటీసులు
By: Tupaki Desk | 21 Aug 2020 12:10 PM GMTఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థకు కళంకం తెస్తున్నారని పీటీషనర్ ఆరోపించారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏపీ హైకోర్టు తాజాగా సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి 16మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో సీబీఐ, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
పిటీషన్ ఈ ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తునకు లేదా సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు తొలుత నోటీసులు జారీ చేసింది. వారి స్పందన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.