Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 11 March 2020 11:45 AM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నో వివాదాలు, అనుమానాలు ఉన్న ఈ హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది.
వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు బుధవారం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండడం.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత బాబాయి హత్యకు గురికావడంతో రాజకీయంగా ఇది పెను సంచలనమైంది. చంద్రబాబే చంపించాడని నాడు వైఎస్ జగన్ ఆరోపించారు. జగన్ సైతం నాడు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు మాత్రం సీఎంగా ఈ కేసుపై సిట్ వేశారు.
అయితే సీఎంగా జగన్ ఎన్నికవడంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసి విచారిస్తున్నారు.
అయితే ఈ కేసు ఎటూ తేలకపోవడంతో కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ వివేకా కూతురు, భార్యతోపాటు ఆరోపణలు ఎదుర్కొన్న బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు హైకోర్టుకెక్కారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో తాజాగా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.