Begin typing your search above and press return to search.

పరీక్షల రద్దుపై హైకోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   24 Aug 2020 7:30 PM IST
పరీక్షల రద్దుపై హైకోర్టు సంచలన నిర్ణయం
X
కరోనా దెబ్బకు విద్యార్థుల చదువులు అటకెక్కాయి. పరీక్షలన్నీ పాస్ చేయించారు. కొన్నింటిని వాయిదా వేశారు. ఇప్పుడు స్కూళ్లు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కరోనా వ్యాక్సిన్ రావడమో లేక.. మందు ఏదైనా కనిపెడితే కానీ దీనికి నివారణ లేదు.

ఈ క్రమంలోనే ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ధర్మాసనాన్ని పిటీషనర్లు కోరారు.

అయితే పరీక్షలను వాయిదా వేయగలం కానీ.. రద్దు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి కోర్టు వాయిదా వేసింది.

కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.